నల్గొండ అసెంబ్లీ విజేత ఎవరు..?
1 min readతెలంగాణలో రాజకీయ చైతన్యానికి వేదికగా ఉండే నల్గొండ జిల్లాలో క్రమంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీలో ఉనికి కోల్పోతుండగా బీజేపీ బలం పుంజుకుంటోంది. మరో వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నది. ప్రధానంగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం కీలకం కాబోతుంది. ఇక్కడ గత ఎన్నికల్లో దెబ్బతిన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సారి తన బలం నిరూపించుకోవడానికి సిద్ధమౌతున్నారు. ఇదే సమయంలో కోమటిరెడ్డిని ఓడించి సంచలనం స్రుష్టించిన కంచర్ల భూపాల్ రెడ్డి మరో సారి షాక్ ఇవ్వడానికి వ్యూహాలు రెఢీ చేసుకుంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఇక్కడ పోటీ ఉండనున్నది. బీజేపీ, సిపిఎం నామమాత్రంగా ఉండనున్నాయి. ఒక వేళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరితే రాజకీయాలు తారుమారుకానున్నాయి.
నల్గొండ అసెంబ్లీపైన వీఎస్ఆర్ వ్యూవ్ పాయింట్.. ఈ వీడియోలో