రేవంత్ రెడ్డికే పీసీసీ..?

1 min read

పీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ తీవ్ర కసరత్తు జరుగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకొని అధిష్టానానికి నివేదిక అందించారు. ఇప్పుడు బాల్ అధినేత్రి సోనియా గాంధీ కోర్టులో బాల్ ఉంది. ఆమె నిర్ణయం తీసుకోవడానికి సిద్దమౌతున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో టెన్షన్ నెలకొన్నది. పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఎఐసిసి సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానం అందింది. మరికొందరు కూడా హస్తినకు బయలుదేరుతున్నారు. మరో వైపు పీసీసీ ఛీప్ గా రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn