రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమై ఆయన చర్చించనున్నారు. తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అభిషేక్ మను సింగ్వి కి ఒక స్థానం ఇప్పటికే ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో స్థానం పైన సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి సన్నిహితుడు , సలహాదారు వేం నరేందర్ రెడ్డి రేసులో ముందున్నారు. ఆయనకే బెర్త్ ఖరారు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు బలంగా చెపుతున్నాయి. ఒకరిద్దరు బీసీ నాయకులు రాజ్యసభ ఆశిస్తున్నప్పటికి ఈ సారి మాత్రం వేం నరేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం.రాజ్యసభ అభ్యర్థులిద్దరు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
