తెలంగాణ ఎన్నికల బరిలో వైఎస్ విజయమ్మ
1 min readకాంగ్రెస్ లో విలీన ప్రయత్నాలు విఫలం కావడంతో తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు.ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఈ సారి తెలంగాణలో పోటీ చేయనున్నారు. షర్మిల భర్త అనిల్ ను కూడా బరిలోకి దింపనున్నారు. పాలేరు నుంచి వైఎస్ షర్మిల, మిర్యాలగూడ నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేస్తారు. సికింద్రాబాద్ నుంచి అనిల్ ను రంగంలోకి దించాలని షర్మిల నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ అభ్యర్థులు రంగంలో ఉంటారని ఆమె తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ లోకి వైఎస్ఆర్ టీపీ ని విలీనం చేయాలని షర్మిల తీవ్రంగా ప్రయత్నించారు. సోనియా, రాహుల్ ను కూడా ఆమె కలిశారు. పార్టీ అధిష్టానం పెద్దలతో పలు దఫాలు చర్చలు కూడా జరిగాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం షర్మిల విలీన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెను కలుపుకుంటే ఎన్నికల్లో దెబ్బతినడం ఖాయమని అధిష్టానం ముందు బలంగా వాదించారు. తెలంగాణ నేతల ఒత్తిడితో కాంగ్రెస్ అధిష్టానం షర్మిల విలీన ప్రక్రియ ను పక్కన పెట్టింది. దీంతో ఆమె ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.