చెప్పుతో కొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే
1 min readఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు పెరుగుతోంది. నియోజకవర్గాల్లో నేతల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొన్నది. తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే తన చెప్పుతో తాను కొట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నరసాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే కొత్త పల్లి సుబ్బారాయుడు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంత కాలంగా వీరిద్దరు ఉప్పునిప్పులా ఉంటున్నారు. 2019లో ప్రసాదరాజును గెలిపించినందుకు నర్సాపురం ప్రజలను క్షమాపణ కోరుతున్నానని సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అందరి ముందు తన చెప్పుతో రెండు సార్లు కొట్టుకున్నారు. సుబ్బారాయుడిని ఆయన అనుచరులు వారించారు. కొత్తపల్లి చర్యతో నరసాపురం వైసీపీలో మరో సారి విభేదాలు భగ్గుమంటున్నాయి.
వీడియో లింక్… https://youtu.be/ABDDzLaw3-E