మరో సారి రేవంత్ రెడ్డిపైన నిప్పులు
1 min readకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరో సారి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన విరుచుకుపడ్డారు.గత కొంత కాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన ఆయన తనపైన కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి తనని బయటకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వి.హెచ్ వ్యాఖ్యానించారు. అయితే జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటానని,పార్టీ జెండాతోనే పోతానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా సహకరించినప్పటికి ఆయన తీరు మార్చుకోవడం లేదని వి.హెచ్ అన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణా సంఘం ఉదయం నోటీసులు ఇస్తే అదే రోజు రేవంత్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావును కలిశారని వి.హెచ్ అన్నారు. ఇదేం పద్దతని ఆయన ప్రశ్నించారు. బీసీలను అణదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని వి.హెచ్ వాపోయారు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్షమ్మయ్యను కూడా వేధిస్తున్నారని ఆయన అన్నారు.