రఘవీర్ ను దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..

1 min read

నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రఘవీర్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ వారీగా భారీ కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ,హుజూర్ నగర్ ,కోదాడ తో పాటు పలు చోట్ల ఇప్పటికే సభలను నిర్వహించారు. తాజాగా నాగార్జున సాగర్ లో భారీ సభను ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ప్రసంగిస్తు దేశ స్వాతంత్యానంతరం 75 సంవత్సరాల లో ఎన్నడూ లేనంతగా, ప్రస్తుతము మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందన్నారు.భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం చారిత్రక అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, బీబీనగర్ లో AIIMS పూర్తి చేయడం విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన హైదరాబాదు ITIR ను ఇక్కడ నుండి తరలించిందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  నల్లగొండ పార్లమెంటు సభ్యునిగా కుందూరు రఘువీర్ రెడ్డి గారిని దేశంలోనే అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. బహిరంగ సభలో మాజీ మంత్రి, మాజీ CLP నాయకుడు కుందూరు జానారెడ్డి గారు, శాసనసభ్యులు బాలు నాయక్, కుందూరు జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి,DCC అధ్యక్షులు శంకర్ నాయక్, నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, నల్లగొండ జిల్లా నాయకులు, నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn