సీఎం రేవంత్ రెడ్డి తో లొంగిపోయిన మావోయిస్టు అగ్ర‌నేత‌ల భేటీ

ఇటీవ‌ల లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టు అగ్ర‌నేత‌లు తెలంగాణ‌ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క‌లిశారు.సీఎంతో సమావేశమైన లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి( @దేవ్ జీ), మల్ల రాజిరెడ్డి( @సంగ్రామ్), పుల్లూరి ప్రసాదరావు( @చంద్రన్న), పోతుల కల్పన(@సుజాత), బడే చొక్కారావు (@దామోదర్) , నూనె నర్సింహా రెడ్డి (@గంగన్న) ఉన్నారు. ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వారికి భ‌రోసా ఇచ్చిన‌ట్లు స‌మాచారం. జ‌న‌జీవ‌న స్రవంతిలోకి వ‌చ్చినందుకు వారిని అభినందించారు. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం న‌డుచుకునే పూర్తి స్వేచ్ఛ వారికి ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి అన్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn