కెఎ పాల్ చెంప పగలకొట్టిన టీఆర్ఎస్ కార్యకర్త
1 min readప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ పైన దాడి జరిగింది. రాజన్న సిరిసిల్లా జిల్లా బస్వాపూర్ గ్రామానికి వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్త అనిల్ కెఎ పాల్ చెంప పగలకొట్టాడు.పోలీస్ అధికారుల సమక్షంలో ఈ దాడి జరగడం విశేషం. బస్వాపూర్ లో రైతులను పరామర్శించడానికి వెళ్తున్న కెఎ పాల్ ను పోలీసులు ఆపారు. కారు దిగి పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుతున్న సమయంలోనే టీఆర్ఎస్ కార్యకర్త దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పాల్ ను హైదరాబాద్ కు పంపించారు.