మాజీ ఎమ్మెల్యేకు నడిరోడ్డుపైన చుక్కలు చూపించిన ఎస్.ఐ
1 min readహైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి ఓ ఎస్ ఐ చుక్కలు చూపించారు. కారులో మాస్క్ లేకుండా వెళ్తున్న ఆయనకు 1000 రూపాయల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనకు ఈ ఫైన్ వేశారు. ఎస్.ఐ తన కారును ఆపడంపైన మాజీ ఎమ్మెల్యే తీగల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి ఎస్ఐ ముఖేష్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్ఐ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. మర్యాద ఇచ్చి తీసుకోవాలని తీగలకు స్పష్టం చేశారు. నువ్వు ఎవరైతే ఏమిటని ఎదురు తిరగడంతో తీగల అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీగల క్రిష్ణారెడ్డి తీరుపైన విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఒక వైపు కరోనా కారణంగా జనం అల్లాడుతుంటే తీగల బాధ్యతారాహిత్యంగా వ్యవహారించడానికి తప్పుపడుతున్నారు. తీగలకు జరిమానా విధించిన ఎస్.ఐకి నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.