కేసీఆర్ పైన పోలీసులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు
1 min readభారత రాజ్యాంగాన్ని అవమానపర్చిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపైన చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపైన గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రిపైన కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను కోరారు. కేసీఆర్ కామెంట్స్ నేరపూరితంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రచురించిన వార్తా సంస్థలు, మీడియాపైన కూడా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు.