కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – నేడు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు, రేపు కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తిరువంతనపురం,అలుపుంజి,ఎర్నాకులం జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ఆయన పలు సభలు, రోడ్ షోలకు హాజరవుతారు. తిరువనంతపురంలో SM లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు రోడ్ షో ,భారతన్నూర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. పూవాచల్ ప్రాంతంలో (కట్టక్కడ నుంచి పూవాచల్, వెల్లనാട് వరకు) రోడ్ షో, అలప్పుజలో కార్నర్ మీటింగ్కు హాజరై పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు. రాత్రి కి ఎర్నాకులంలో బస చేస్తారు. గురువారం కూడా ఆయన కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 6 వ తారీఖు తర్వాత రెండో విడత ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ కూటమి ఈ సారి విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి.
