కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం

తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులిద్దరు ఏకగ్రీవం కానున్నారు. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పుటికి పరిశీలనలో తిరస్కరణకు గురి కానున్నాయి. రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను ప్రతిపాదిస్తు 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులను ఎవరూ ప్రతిపాదించకపోవడంతో వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరిస్తారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం కానున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి సర్టిఫికెట్ అందజేస్తారు. రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునేంత బలం లేకపోవడంతో బీఆర్ఎస్ తో పాటు మిగిలిన పార్టీలు పోటీ పెట్టలేదు. దీంతో పోలింగ్ జరగకుండానే రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి.
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులిద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు అనేక మంది మంత్రులు,ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. ఇద్దరు మజ్లిస్ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డి ని ప్రతిపాదిస్తు నంతకం చేశారు. స్వయంగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
