హోంగార్డు సేవలకు చీఫ్ జస్టిస్ ఫిదా
1 min readతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ హోంగార్డ్ పనితీరుకు ముగ్దుడయ్యాడు. సిన్సియర్ గా పని చేస్తున్న అతన్ని అభినందించడానికి స్వయంగా బోకేతో వచ్చారు. నడిరోడ్డుపైనే కాన్వాయ్ ఆపి మరి చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర హోంగార్డు అష్రఫ్ అలీని అభినందించారు. ప్రతి రోజు అదే మార్గంలో వెళ్లే ప్రధాన న్యాయమూర్తి హోంగార్డు పనితీరును గమనించారు. విధి నిర్వహణ పట్ల అతని నిబద్దత ఛీప్ జస్టిస్ అభినందించారు.