తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల మరో పాదయాత్ర

1 min read

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మరో పాదయాత్రను ప్రకటించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా తాము కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 3 న ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఈ పాదయాత్ర ప్రారంభమౌతుంది. మొదట పది రోజుల షెడ్యూల్ ను నేతలు ప్రకటించారు. హైదరాబాద్ గాంధీభవన్ లో ముగింపు సభను నిర్వహిస్తామని సీనియర్ స్పష్టం చేశారు. ఎఐసిసి కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ ,మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర వివరాలను ప్రకటించారు. ఈ యాత్రలో సీనియర్ నేతలంతా పాల్గొంటారని ఆయన వివరించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో సీనియర్లు మరో యాత్రను ప్రకటించడం కాంగ్రెస్ లో గందరగోళానికి తెరలేపినట్లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn