ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్
1 min read
తెలంగాణ కాంగ్రెస్ తన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక లో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ ను ప్రదర్శించారు. తన వర్గానికి అవకాశం ఇప్పించుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. ఉత్కంఠకు తెర దించుతూ పార్టీ అధిష్టానం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. గత కొంత కాలంలో ఎమ్మెల్సీ పదవి కోసం వేచి చూస్తున్న అద్దంకి దయాకర్ కు ఈ సారి హైకమాండ్ శుభవార్త చెప్పింది. ఆయన తో పాటు పార్టీ సీనియర్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి కి కూడా ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించింది. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, గిరిజన నాయకులు శంకర్ నాయక్ ను కూడా శాసనమండలి కి పంపించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ ముగ్గురికి పదవులు ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంత కాలం గా ప్రయత్నిస్తున్నారు. సీఎం సూచనల మేరకు పార్టీ అభ్యర్థులను హైకమాండ్ ఖరారు చేసింది. మరో సీటును మిత్రపక్షం సీపీఐ కి కేటాయించింది.