కేసీఆర్ కు కరోనా
1 min readతెలంగాణలో కరోనా కలకలం స్రుష్టిస్తోంది.స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. ఆయనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆదిత్యనాథ్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఫాంహౌజ్ లో హోం అసోలేషన్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇటీవల హాలియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ సభలో పాల్గొన్న అనేక మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలకు కూడా కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పాటు కడారి అంజయ్య, ఎం.సి కోటిరెడ్డికి కూడా పాజిటివ్ వచ్చింది.