9నెలల తర్వాత రాజ్ భవన్ కు సిఎం కేసీఆర్
1 min readతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 9 నెలల తర్వాత రాజ్ భవన్ కు వెళ్లారు . తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన గవర్నర్ తమిళసైని కలవాల్సి వచ్చింది. గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి తేనేటీ విందులో పాల్గొన్నారు. గత కొన్నాళ్లుగా సిఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లడం లేదు. గవర్నర్ తమిళ సైని సిఎంతో పాటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు అధికారులు కూడా కలవడం లేదు. రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రి అదేశాల మేరకు రాజ్ భవన్ ను అనధికారికంగా టీఆర్ఎస్ బహిష్కరించింది. గవర్నర్ తమిళ సై బీజేపీ కార్యకర్తలా వ్యవహారిస్తున్నారంటు అధికార పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ వైఖరీపైన గవర్నర్ తమిళ సై కూడా మీడియా ముందు అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల మధ్యే ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు వెళ్లాల్సి వచ్చింది.