రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలోకి అజారుద్దీన్

తెలంగాణ మంత్రి వర్గాన్ని మరో సారి విస్తరించబోతున్నారు. ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోనున్నారు. ఈ నెల 31 న పదకొండు గంటలకు మంత్రి వర్గ విస్తరణ జరగనున్నది. అజారుద్దీన్ ప్రస్తుతం ఏ సభలో సభ్యుడు కారు. ఆయనను శాసనమండలికి నామినేటేడ్ చేస్తు రాష్ట్ర మంత్రి వర్గం గవర్నర్ కు సిఫారసు చేసింది. ఇప్పటి వరకు దీనిపైన గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రెండు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ముగ్గురిని కేబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రులు గా అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, వివేక్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో కూడా మైనార్టీ వర్గానికి చెందిన వారికి అవకాశం ఉంటుందని అంతా భావించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మైనార్టీ వర్గానికి చెందిన ఎవరూ విజయం సాధించలేదు. దీంతో మంత్రివర్గంలో అవకాశం లేకుండా పోయింది. దీంతో అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారు.
