ఎమ్మెల్సీగా అజారుద్దీన్

శాసనమండలి కి భారత మాజీ క్రికెట్ టీం కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ పేరును గవర్నర్ కు సిఫారసు చేస్తు తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పేరు ను కూడా మరోసారి గవర్నర్ కు మంత్రి వర్గం సిఫార్సు చేసింది. కోదండరాంతో పాటు కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ శానసమండలి సభ్యత్వాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో మరో సారి కోదండరాంతో పాటు అజారుద్దీన్ లను శాసనమండలి కి నామినేట్ చేయాలని గవర్నర్ కు సిఫారసు చేశారు. అమీర్ అలీఖాన్ స్థానం అజారుద్దీన్ కు అవకాశం కల్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అజారుద్దీన్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయను పోటీ నుంచి తప్పించడం కోసం ముందుగానే ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. అమీర్ అలీఖాన్ ను రాజ్యసభకు పంపించే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.