జగన్ కు షాక్.. పులివెందుల లో టీడీపీ పాగా

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. తమ కంచుకోటలో వైసీపీ దారుణ పరాభవాన్ని చవిచూసింది.తెలుగుదేశం అభ్యర్థి లతారెడ్డి ఏకంగా 6,052 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పైన గెలిచారు. వైసీపీ కి కేవలం 683 ఓట్లు మాత్రమే రావడం విశేషం. టీడీపీ అభ్యర్థి కి 6,735 ఓట్లు వచ్చాయి. ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడం విశేషం.
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలో కూడా టీడీపీ గెలిచింది. 6154 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి కి 6351 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి కి 12505 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా చాలా కాలం తర్వాత తెలుగుదేశం గెలవడం విశేషం.