వైసీపీ కి తెలుగుదేశం భారీ షాక్

1 min read

ఎపి సిఎం వైఎస్ జగన్ కు తెలుగుదేశం భారీ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఊహించని విధంగా ఆమె గెలవడంతో తెలుగుదేశంలో అనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. అనురాధకు 23 మంది ఎమ్మెల్యే ఓటు వేశారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో నలుగురు శాసనసభ్యులు పార్టీ ఫిరాయించి వైసీపీకి జై కొట్టారు. దీంతో 19 మాత్రమే మిలిగారు. అయితే వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే రెబెల్ గా మారడంతో తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది. కాని వైసీపీ మాత్రం తన అభ్యర్థులు 7 గురు విజయం సాధిస్తారని బలంగా నమ్మింది. ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పకుండా సిఎం జగన్ పకడ్బందీ చర్యలు చేపట్టారు. అయినప్పటికే ఇద్దరు వైసీపీ శాసనసభ్యులు టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. దీంతో వైపీసీ కి మైండ్ బ్లాక్ అయినట్లైంది. ఇటీవలె మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn