కడియం శ్రీహరి, దానం నాగేందర్ పార్టీ మారలేదు..

దానం నాగేందర్, కడియం శ్రీహరి పైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. వారు పార్టీ మారినట్లు ఎక్కడా ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.వారిపైన బీఆర్ఎస్ర బీజేపీ పార్టీలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. దీంతో మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన ఇచ్చిన అనర్హత పిటిషన్ల పైన విచారణ పూర్తై తుది తీర్పు వచ్చింది. అనర్హత పిటిషన్ల పైన విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
