సంతోష్ రావు కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా గా మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నాం మూడు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇటీవలె మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను సిట్ విచారించింది. అవసరమైతే మరో సారి విచారిస్తామని సిట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది.
మరో వైపు సిట్ విచారణకు హాజరవుతానని సంతోష్ రావు స్పష్టం చేశారు. మంగళవారం సిట్ కార్యాలయానికి వెళ్తానని, విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసుల విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
