రేవంతన్నకు ఫోన్ చేయమంటవా..?
1 min readపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో ధైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న కేడర్ పోలీసులను సైతం లెక్కచేయడం లేదు. రేవంత్ రెడ్డి ఉన్నాడన్న విశ్వాసంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దూసుకుపోతున్నారు. భారత్ బంద్ లో భాగంగా సిద్దిపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ నేత పూజల హరిక్రిష్ణ తీవ్ర ఆగ్రహనికి గురైయ్యారు. పోలీసు అధికారుల తీరుపైన విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తానంటు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి తన వెంట ఉన్నాడన్న ధైర్యం పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తోందని ఈ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.