జీయర్ స్వామి…క్షమాపణ చెప్పు

1 min read

చినజీయర్ స్వామి వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఆయన చేస్తున్న ప్రసంగాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కులాలు ఉండాలంటు ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా చినజీయర్ స్వామి సమ్మక్క సారలమ్మ పైన చేసిన కామెంట్స్ బయటకు వచ్చాయి. సమ్మక్క సారలమ్మకు ఎలా దేవతలు అవుతారని ఆయన ప్రశ్నించారు. మేడారం జాతరను కూడా చినజీయర్ ప్రశ్నించారు. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క జీయర్ పైన నిప్పులు చెరిగారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సమ్మక్క సారమల్మ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడం లేదని సీతక్క వ్యాఖ్యానించారు. చిన జీయర్ సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసి టిక్కెట్ల పేరుతో వ్యాపారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. చిన జీయర్ స్వామి కామెంట్స్ పైన సిఎం కేసీఆర్ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn