ఎమ్మెల్యే సీతక్క కన్నీళ్లు

ములుగు ఎమ్మెల్యే సీతక్క కన్నీరుమున్నీరయ్యారు. గత కొంత కాలంగా తనకు సెక్యూరిటీగా ముగ్గురు కానిస్టేబుళ్లు బదిలీ కావడంతో ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ఇన్ని రోజుల పాటు తనకు వెన్నుదన్నుగా నిలిచిన గన్ మెన్ల సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా తనని భద్రంగా చూసుకున్నారని సీతక్క అన్నారు. ముగ్గురు గన్ మెన్లను సత్కరించి భారంగా వీడ్కోలు పలికారు. సీతక్క అభిమానానికి సెక్యూరిటీ సిబ్బంది కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.