పెద్దిరెడ్డిపైన నిమ్మగడ్డ షాకింగ్ నిర్ణయం

1 min read

ఎపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆయనను కట్టడి చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ నెల 21 వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేాయాలని రమేష్ కుమార్ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. మీడియాతో కూడా ఆయన మాట్లాడకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిపించడం కోసమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఎన్నికల కమిషన్ పైన గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు సర్టిఫికెట్ ఇవ్వకపోతే అధికారులపైన చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. దీనిపైన ఎన్నికల సంఘం తీవ్ర నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn