ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
1 min readఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ,సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వేదాంత ఆస్పత్రిలో చివరి శ్వాస విడిచారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ యూపీ మాజీ సిఎం. ములాయం సింగ్ యాదవ్ కు ఇద్దరు భార్యలు. ఇటీవలె ఒక భార్య అనారోగ్యంతో చనిపోయారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేశారు. జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. సంకీర్ణ రాజకీయాల్లో ములాయం వాహ నడిచింది. అనారోగ్య కారణాల రీత్యా గత కొంత కాలంగా క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన కుమారుడు అఖిలేష్ తరుపున ప్రచారం చేశారు.