పేకాటలో ఆ ఎమ్మెల్యే లేడు
1 min readమాదాపూర్ పోలీసులు పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. వీరి నుంచి ఏకంగా 90 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతు దొరికిన వాళ్లలో ముగ్గురు మహిళలు కూడా ఉండటం విశేషం. వీరి దగ్గర సంచుల్లో నోట్ల కట్టలున్నట్లు పోలీసులు చెపుతున్నారు. పేకాట ఆడుతున్న దొరికిన వాళ్లలో పలువురు రియల్టర్లు ఉన్నారు. అయితే పేకాట ఆడుతు పట్టుపడిన వాళ్లలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోలీసులు ఆయనను ఈ కేసు నుంచి తప్పించిన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాకతీయ హిల్స్ లో ఈ భవనం ఒక ఎమ్మెల్సీకి చెందిన ఆఫీసు అని కూడా చెపుతున్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మాత్రం ఎమ్మెల్యే ఎవరూ ఈ కేసులో లేరని చెపుతున్నారు. ఆమె స్వయంగా ఎస్ వోటీ పోలీసులతో కలిసి పేకాట శిబిరంపైన దాడి చేయడం విశేషం.