కోమటిరెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి
1 min readపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి సాధరంగా ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కోమటిరెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లడం ఇదే మొదటి సారి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దక్కడంతో నిరుత్సాహానికి గురైన కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బులతో పీసీసీ అధ్యక్ష పదవి కొనుకున్నాడంటు రేవంత్ పైన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులు నా ఇంటి గడప తొక్కొద్దంటు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నన్నని రోజులు గాంధీభవన్ మెట్లు ఎక్కనని కూడా ఆయన అన్నారు. అయితే ఆ తర్వాత చల్లబడిన కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి తో సఖ్యతతో వ్యవహారిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గాంధీ భవన్ కు కూడా ఆయన వెళ్లారు. వరి రైతుల కోసం ఇందిరాపార్క్ లో కాంగ్రెస్ చేసిన దీక్షలో రేవంత్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ దాదాపుగా తొలగిపోయినట్లైంది. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సఖ్యతపైన కాంగ్రెస్ కార్యకర్తల్లో హర్షం వ్యక్తమౌతోంది.