ఎకరం రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు
1 min readముఖ్యమంత్రి ఆదేశాలతో ఒక ఎకరం వరకు, సాగులో ఉన్న భూములకు రైతుభరోసా నిధులు జమ
– 17.03 లక్షల రైతుల అకౌంట్లలో జమయిన నిధులు
– రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉన్నది – మంత్రి తుమ్మల
– ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం1126.54 కోట్లు రైతుభరోసా నిధులు జమ – మంత్రి తుమ్మల
– ఇప్పటికే రైతుబంధుకు 7625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు భీమాకు 3000 కోట్లు.
– పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
– ఎన్నడూలేని విధంగా రూ. 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్ధతుధరకు సేకరణ.
– ప్రత్తిపంటను పూర్తిగా సేకరించడానికి గడువుకోరిన మంత్రి తుమ్మల.
– రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులు పంటలను మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్దనుండి మద్ధతు ధరకు కోనుగోలు చేసిన ప్రభుత్వం
– గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు.
– వరిపంటను మద్ధతు ధరకు కోనుగోలు చేస్తున్న ప్రభుత్వం.
– యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, 10,547 కోట్లు
– ఖరీఫ్ లో 52.51 లక్షల మెట్రిక్ టన్నులు, 12,178.97 కోట్లు
– సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చి కొన్న ప్రభుత్వం. అందుకు 1154 కోట్లు ఖర్చు.
– ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగింపు.
– పసుపు, మిరప పంటలకు మద్ధతు ధర నిర్ణయించడానికి కేంద్రప్రభుత్వానికి విజ్ఙప్తులు
– వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా
– విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్భంది చర్యలు తీసుకున్న ప్రభుత్వం
– కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఎరువుల కేటాయింపుల కోసం విజ్ఙప్తులు
– మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతే – మంత్రి తుమ్మల