వనమాను అరెస్టు చేయరేం..? రేవంత్ రెడ్డి
1 min read
పాల్వంచలో ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను ఎందుకు అరెస్టు చేయలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మానవ మ్రుగంలా తయారైన రాఘవను ప్రభుత్వం రక్షిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వనమాను తక్షణమే టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా కారణంగా హోం హైసోలేషన్ లో ఉంటున్న రేవంత్ రెడ్డి వనమా వ్యవహారంపైన ఒక వీడియో విడుదల చేశారు.