రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్
1 min readతెలంగాణ ప్రగతి భవన్ ప్రజా భవన్ గా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రగతి భవన్ ను పేరును మార్చి అక్కడ ప్రజాదర్బార్ ను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన అనేక మంది తన కష్టాలు,సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చెప్పుకున్నారు. మంత్రి సీతక్క కూడా వచ్చిన వారితో మాట్లాడి వారి నుంచి వినతిపత్రాలను తీసుకున్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లోకి సామాన్యులకు అనుమతి ఇవ్వలేదు. ఎక్కడా ఆయన వినతిపత్రాలను తీసుకోలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికి ఆయన మారలేదు. దీంతో ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఆయన సీఎం బాధ్యతలు చేపట్టగానే ప్రగతి భవన్ గేట్లు తెరిపించి ప్రజా భవన్ గా మార్చారు.