రాజకీయాల నుంచి తప్పుకుంటా.. రేవంత్ ఛాలెంజ్
1 min read
తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2019 జనవరి తరువాత కొడంగల్ అభివృద్ధి గురించి నమస్తే తెలంగాణ పేపర్‌లో రాసినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఉన్నట్టు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే పోలెపల్లి ఎల్లమ్మ పై ఒట్టువేసి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కంటే కూడా ఎక్కువ అబద్ధాలు కేటీఆర్ చెప్తున్నారని విమర్శించిన రేవంత్.. అందుకే సీఎం పదవికి అర్హత సాధించి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను కేసీఆర్ సీఎం చేయబోడని. కేటీఆర్ సమర్థత ఏంటో అందరికంటే ఎక్కువ కేసీఆర్‌కే తెలుసన్నారు. ప్రసుత్తం మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్లే కేటీఆర్ సీఎం కావాలని అంటున్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.కేటీఆర్ సీఎం అయితే సమస్య అంతా….కవిత- హరీష్- సంతోష్‌కు మాత్రమేనన్నారు రేవంత్ రెడ్డి..కేటీఆర్ సీఎంకు సమర్థుడు అయితే కేసీఆర్ అసమర్థుడా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు తాను చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి మళ్లీ అవకాశం వచ్చిందని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందని కేసీఆర్ అనుకుంటే రసమయి బాలకిషన్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మేయర్ పదవి బీజేపీకి వదిలిపెడతా అని ఢిల్లీ పర్యనటలో కేసీఆర్ హామీ ఇచ్చి వచ్చారని ఆరోపించారు. రసమయి బాలకిషన్ ను సీఎం చేయాలి.