వైఎస్ షర్మిలపైన రేణుకా చౌదరి ఫైర్
1 min readకాంగ్రెస్ లో వైఎస్ షర్మిల పార్టీ విలీనంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టీ కాంగ్రెస్ కు చెందిన పలువురు సీనియర్లు షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నారు. షర్మిల విలీనం వల్ల కాంగ్రెస్ కు నష్టం ఖాయమని నేతలు ఆందోళనలు చెందుతున్నారు. తాజాగా రేణుకా చౌదరి ఈ జాబితాలో చేరారు. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ కోడలని షర్మిలకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ కోడలైతే.. తాను తెలంగాణ ఆడబిడ్డనన్నారు. షర్మిల ఏదైనా అడగొచ్చు.. ట్యాక్స్ ఏమీ లేదు కదా అంటు ఎద్దేవా చేశారు. ఏదన్నా అడగడానికి అర్హత ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ విలీనంపై షర్మిల, రాహుల్, సోనియాను కలిసారంతే.. కానీ వాళ్లు ఇంకా ఏం చెప్పలేదన్నారు. షర్మిల తెలంగాణలా పోటీచేసే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ లో చేరికకు షర్మిల ఒక్కరే ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని సెటైర్ వేశారు. షర్మిల ముందు అమరావతి రైతుల గురించి మాట్లాడాలన్నారు.
వైఎస్సార్ టీపీ విలీనంపై ఇటీవల వైఎస్ షర్మిల ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అయితే విలీనాన్ని ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా మరో వర్గం స్వాగతిస్తుంది. ఈ క్రమంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.