బీజేపీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్

రాహుల్ గాంధీ మరో సారి తన విలక్షణతను చూపించారు. భారత్ జోడో యాత్ర పేరుతో సుధీర్ఘ పాదయాత్ర చేస్తున్న ఆయన పౌరుల మధ్య ద్వేషం వద్దు ప్రేమ ఉండాలని స్పష్టం చేస్తున్నారు. రాజస్థాన్ లోని కోటా సమీపంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ తన సిద్దాంతాన్ని ఆచరణలో చూపించారు. పాదయాత్ర మధ్యలో తనకు కనిపించిన బీజేపీ కార్యకర్తలకు రాహుల్ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. బీజేపీ ఆఫీసుపై నుంచి పాదయాత్రను చూస్తున్న కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు మాత్రం రాహుల్ గాంధీకి తిరిగి అభివాదం చేయకపోవడం విశేషం.