రాహుల్ గాంధీపైన అనర్హత వేటు

1 min read

రాహుల్ గాంధీపైన అనర్హత వేటు వేసింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్ సభ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపిగా అనర్హుడిని చేస్తు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయినప్పటికి లోక్ సభ స్పీకర్ రాహుల్ గాంధీపైన అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు. మోదీ ఇంటి పేరు ఉన్న వాళ్లందరు దొంగలే అంటు 2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.దీనిపైన పరువు నష్టం దావా దాఖలైంది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి గత ఎన్నికల్లో ఎంపిగా విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn