జగన్ కు మరో భారీ షాక్

వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా మరో వికెట్ పడింది. రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే రాజ్యసభ చైర్మన్ ను రాజీనామా ను ఆమోదించారు. రాజ్యసభ సీటు ఖాళీ అయినట్లు బులిటెన్ విడుదలయ్యేంత వరకు ఆయన రాజీనామా విషయం బయటకు రాకపోవడం విశేషం. తెలంగాణ కు చెందిన ఆర్ .క్రిష్ణయ్య కు వైసీపీ రాజ్యసభ సభ్యుడిని చేసింది. ఆంధ్రప్రదేశ్ లో బీసీ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆయనకు సీటు ఇచ్చారు. కాని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో క్రిష్ణయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆయన బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.