వాయనాడ్ కు సీఎం రేవంత్ రెడ్డి

1 min read

  వాయనాడ్  లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే వయనాడ్ బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గత ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా విజయం సాధించారు. రాయ్  బరేలీ నుంచి కూడా ఆయన గెలవడంతో వయనాడ్ సీటు ను వదులుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. వాయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలిస్తే మొదటి సారి లోక్ సభలో అడుగు పెడతారు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn