మునుగోడులో రాజగోపాల్ రెడ్డిపైన పోస్టర్లు
1 min readమునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనపోస్టర్ల యుద్దం ఊపందుకుంది. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోెసమే ఆయన ఉప ఎన్నిక కోసం వెళ్లారన్న ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యర్థి పార్టీలు కొత్త వ్యూహాలకు తెర లేపాయి. కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ కు ద్రోహం చేశారంటు గతంలో పోస్టర్లు మనుగోడు అంతా వెలిశాయి. తాజాగా కాంట్రాక్ట్ పే పేరుతో 18 వేల కోట్ల కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డికి కేటాయించడమైందంటు ఆయన ఫోటోతో భారీ ఎత్తున పోస్టర్లు వేశారు. ఇటీవల కర్నాకటలో 40 పర్సెంట్ సిఎం పేరుతో వేసిన పోస్టర్ల తరహాలో ఇవి ఉన్నాయి. రాత్రికి రాత్రే మునుగోడు అంతా ఇవి గోడలపైన వేశారు.