రాజగోపాల్ రెడ్డిపైన పోస్టర్లు
1 min readమునుగోడులో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంటోంది. ఆధిపత్యం కోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీలో చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన కాంగ్రెస్ యుద్దాన్ని ప్రకటించింది. ఆయన తీరుపైన తీవ్ర విమర్శలు చేస్తున్న ఆ పార్టీ నేతలు ఇప్పడు పోస్టర్ల ప్రచారానికి దిగారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి ద్రోహాం చేశారంటు నియోజకవర్గంలో పోస్టర్లు వేశారు. నారాయణపురం, చౌటుప్పల్ ల్లో పోస్టర్లు వెలిశాయి. మునుగోడు నిన్ను క్షమించదంటు రాజగోపాల్ రెడ్డి బొమ్మతో పోస్టర్లను ముద్రించారు. 22వేల కాంట్రాక్టుల కోసం 13 యేళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహి అని అందులో నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఈడీ వేధించిన రోజే అమిత్ షాతో బేరమాడిన నీచుడివి అంటు పోస్టర్లల్లో పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి పోస్టర్లు ఇప్పుడు మునుగోడులో కలకలం స్రుష్టిస్తున్నాయి. అయితే వీటిపైన పోలీసులను ఆశ్రయించడానికి రాజగోపాల్ రెడ్డి సిద్దమౌతున్నట్లు సమాచారం.