రెండో సారి రేవంత్ రెడ్డికి కరోనా
1 min read
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో సారి కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారు టెస్ట్ చేయించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వివరించారు. గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యుల సలహా మేరకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా రేవంత్ రెడ్డికి కరోనా వచ్చింది. రేవంత్ రెడ్డి రెండు వ్యాక్సిన్ డోస్ లు తీసుకున్నారు.