కొడంగల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
1 min readపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో అడుగుపెట్టనున్నారు. పార్టీ అధ్యక్షబాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఆయన కొడంగల్ కు వెళ్తున్నారు. కాంగ్రెస్ జన జాగరణ ప్రజాచైతన్య పాదయాత్ర లో భాగంగా రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సొంత జిల్లా వికారాబాద్ ఇంఛార్జిగా ఆయన వ్యవహారిస్తున్నారు. వివిధ సమస్యలపైన ప్రజల్లోకి వెళ్లడానికి పీసీసీ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు పాదయాత్ర నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు జన జాగరణ ప్రజా చైతన్య కార్యక్రమం జరగనున్నది.రేవంత్ రెడ్డి ఐదు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తారు. 14న బొంరాస్ పేటలో ,15న కొడంగల్ ,16న దౌల్తాబాద్ మండలంలో ఆయన పాదయాత్ర చేస్తారు. 17న మద్దూర్, 18న కోస్గి లో రేవంత్ రెడ్డి కార్యక్రమం ఉండనున్నది. ప్రతి రోజు పది కిలో మీటర్ల పాటు ఆయన పాదయాత్ర చేస్తారు.
మరో వైపు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటి సారి కొడంగల్ కు వెళ్తున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకడానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ వైపు చూడలేదు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగా నియోజకవర్గానికి వెళ్లలేకపోయారు. మరో వైపు రేవంత్ రెడ్డి ఈ సారి కొడంగల్ లో పోటీ చేయరనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో అక్కడ ఓడిపోయిన నేపథ్యంలో ఆయన నిరాశలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అందుకే కొడంగల్ కు రేవంత్ రెడ్డి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలోని ఎల్ .బి.నగర్ నుంచి ఈ సారి అసెంబ్లీకి పోటీ చేస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రచారాన్ని ఖండించారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కొడంగల్ నుంచే పోటీ చేస్తానని ఇప్పటి కే స్పష్టం చేశారు. మరో వైపు కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి తరుచుగా వెళ్లలేకపోయినప్పటికి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇక్కడ ఇంచార్జిగా వ్యవహారిస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్ని ఆయననే పర్యవేక్షిస్తుంటారు. తిరుపతి రెడ్డి కొడంగల్ లో ఉండి కార్యకర్తల యోగ క్షేమాలను చూస్తుంటారు. దీంతో రేవంత్ రెడ్డి లేని లోటు పెద్దగా అక్కడ కనిపించదని పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తానికి పార్టీ అధ్యక్షుడిగా నియోజకవర్గంలో అడుగుపెడుతున్న రేవంత్ రెడ్డి కి కనివినియరగని రీతిలో స్వాగతం పలకడానికి కార్యకర్తలు సిద్ధమౌతున్నారు.