రేవంత్ రెడ్డి మళ్లీ అరెస్ట్
1 min readతెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వరసగా రెండో రోజు పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తన నివాసం నుంచి బయటకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ కు రేవంత్ రెడ్డిని తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బర్త్ డే సందర్బంగా రేవంత్ ను అరెస్ట్ చేయడం విశేషం. కేసీఆర్ పుట్టిన రోజున గాడిదలకు జన్మదినం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.