బీజేపీ పైన యుద్ధం చేస్తాం…మహేష్ కుమార్ గౌడ్
1 min readటీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
– డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలంగాణ పై కేంద్రం వైఖరికి నిరసనగా బీజేపీ పై యుద్ధం ప్రకటిస్తున్నా
– తెలంగాణ సంక్షేమం , అభివృద్ది రాజకీయాలను పక్కన పెట్టీ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని కోరుతున్నా
– కేంద్ర నిధులు ఇచ్చే వరకు శాంతియుతంగా పోరాటం చేస్తాం
– ఇద్దరు కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి పట్టదా?
_ తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా
– తెలంగాణ కోసం సీఎం రేవంత్, మంత్రులు ఒంటరి పోరాటం చేస్తున్నారు
– తెలుంగింటి కోడలు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే కేటాయించినట్టుగా ఉంది
– తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై బీజేపీ చూపిస్తున్న వివక్ష, రాజకీయ కక్షకు బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం
– రాష్ట్రం నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఉంటే కేంద్రం తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చింది
– ‘‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’’ తెలుగు గేయం వినిపించి తెలుగువారి ఆకాంక్షలకు, తెలుగునేల అభివృద్ధికి మొండిచేయి చూపించారు
– బడ్జెట్ కేటాయింపులు ఢిల్లీ, బీహర్ ఎన్నికల కోసమే అన్నట్లుగా ఉంది
– రాజకీయ అవసరాల కోసం బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటూ రాష్ట్రాలను విడదీస్తూ జాతి సమగ్రతను పక్కన పెట్టింది
– బడ్జెట్ లో దేశ సమ్మిళిత వృద్ధిని కేంద్రం కొంచెం కూడా పట్టించుకోలేదు
– బడ్జెట్ కేటాయింపులు తెలంగాణ పట్ల బీజేపీ సవితి ప్రేమను తెలియజేస్తున్నది
– కొన్ని రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయింపులతో వికసిత్ భారత్ ఎలా సాధ్యం?
– దేశ జీడీపీలో 5.1 శాతం వాటా ఉన్న తెలంగాణకు 2.10 శాతమే తిరిగి వస్తోంది
– తెలంగాణ నుంచి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో సుమారు రూ. లక్ష వేల కోట్ల రూపాయిలు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీసం 40 వేల కోట్లు తిరిగి ఇవ్వకపోవడం బాధాకరం
– బడ్జెట్ లో విభజన చట్టం హామీలు, మెట్రో రెండో దశకు నిధుల కేటాయింపు తో పాటు ఇతర వాటికి కేటాయింపులు శూన్యం
– సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని గొప్పలకు పోయే బీజేపీకి దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు, వారి సమస్యలు కనపడకపోవడం విడ్డూరం
– 2025-26 బడ్జెట్ కేటాయింపులు చూసి తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరు
– తెలంగాణ అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి తెలంగాణ పౌరుడు ఏకతాటిపైకి రావాలిసిన అవసరం ఉంది
– కేంద్రం కక్ష పూరిత వైఖరికి నిరసనగా బిఆర్ఎస్, తెలంగాణవాదులు ముందుకు రావాలి
– మాటిమాటికి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనను విమర్శిస్తారు. ఇప్పుడు బడ్జెట్ కేటాంయిలపై వారు ఏం సమాధానం చెబుతారు
– రాష్ట్ర నిధుల కోసం సీఎం రేవంత్, మంత్రులు ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని కలిసి యాచించిన తెలంగాణకు ఒరిగింది ఏమి లేదు
– కేంద్రం వైఖరికి నిరసనగా సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ నుంచి పట్టణం వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిస్తున్నా