కౌషిక్ రెడ్డి యూటర్న్
1 min read
సరిగ్గా నాలుగు రోజుల క్రితం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌషిక్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారు. రేవంత్ రెడ్డి పులిలా వస్తున్నాడని చెప్పిన ఆయనే దమ్ముంటే డిపాజిట్ తేవాలంటు సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పాడి కౌషిక్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి అభినందించి వచ్చాడు. హుజూరాబాద్ నాయకులను వెంట తీసుకెళ్లి పరిచయం చేశారు. టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆఫర్ రాగానే కౌషిక్ రెడ్డి ప్లేట్ ఫిరాయించి యూటర్న్ తీసుకున్నాడు.