ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం తమ్ముడికి నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కి సిట్ నోటీసులు జారీ చేసింది. గురువారం సిట్ ముందు హాజరుకావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొండల్ రెడ్డి ని సిట్ అధికారుల విచారణ కోసం నోటీసులు ఇచ్చారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రేవంత్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేసింది.
