ఎంపి అర్వింద్ కు టీఆర్ఎస్ షాక్
1 min readనిజామాబాద్ లో టీఆర్ఎస్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బీజేపీ ఎంపి అర్వింద్ ను గులాబీ నాయకత్వం టార్గెట్ చేసింది. ఆయన అనుచరులను ఒక్కొక్కరిగా టీఆర్ఎస్ లో చేర్చుకుంటోంది. తాజా నిజామాబాద్ 23 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ కవిత ఆయనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు కొందరు అధికార పార్టీలో చేరారు.