విడాకులు తీసుకున్న నాగబాబు కుమార్తె నిహారిక
1 min readమెగాస్టార్ కుటుంబంలో మరో జంట విడాకులు ఖాయమయ్యాయి. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక దంపతులు విడిపోయారు. నిహారిక,చైతన్య దంపతులకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.
నిహారిక, చైతన్య వివాహం 2020 డిసెంబర్ లో జరిగింది. ఉదయ్ పూర్ లో జరిగిన వీరి పెళ్లి కి టాలివుడ్ ప్రముఖులు అనేక మంది హాజరయ్యారు. అయితే మూడేళ్లు కాకముందే వీరు విడాకులకు సిద్ధం కావడం విశేషం. నిహారక,చైతన్యలు యేడాది కాలంగా విడిగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిహారిక వైఖరీ కారణంగా విడాకుల వరకు పరిస్థితి వెళ్లిందని సన్నిహితులు చెపుతున్నారు. పెళ్లైన కొంత కాలం క్రితం అర్థరాత్రి తర్వాత పబ్ లో ఉండగా నిహారికను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం సంచలనం స్రుష్టించింది.
మెగాస్టార్ చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజకు కూడా ఒక సారి విడాకులు అయ్యాయి. ఆమె రెండో పెళ్లి కూడా విఫలమైంది. మొదటి కూతురుకు సినీనటుడు ఉదయ్ కిరణ్ తో నిశ్చిత్తార్థం తర్వాత పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇక చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి బావమరిది అల్లు అర్వింద్ మొదటి కొడుకు కూడా తన భార్యకు డైవర్స్ ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు.
నాగబాబు కుమారుడు,సినీనటుడు వరుణ్ తేజ్ కు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఇటీవలె నిశ్చిత్తార్థం జరిగింది. త్వరలోనే వీరి పెళ్ల ఇటలీలో జరగనున్నది. ఈ సమయంలో నిహారిక విడాకులు తీసుకోవడం విశేసం.